Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / మత్తయి సువార్త

Bible - Telugu Bible OV, 1880

మత్తయి సువార్త మార్కు సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

1 "ఆ దినములలో బాప్తిస్మమునిచ్చు యోహాను వచ్చి-పరలోక రాజ్యము సమీపించి యున్నది,"

2 మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.

3 "''ఆలకించుడి, అడవిలో నొకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా - అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధము చేయుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సిద్ధపరచుడి'' (యెషయా40:3) అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితే."

4 "ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను, మొలచుట్టు తోలుదట్టియును ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము."

5 "ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును, అతని యొద్దకు వచ్చి"

6 తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

7 "అతడు పరిసయ్యులలోను, సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొంద వచ్చుట చూచి - ''సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలములను ఫలించుడి."

8 అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు.

9 దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.

10 ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.

11 మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో (నీళ్ళతో) మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను (పరిశుద్ధాత్మ తోను) అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.

12 "ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును'' అని వారితో చెప్పెను."

13 ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను.

14 "అందుకు యోహాను - నేను నీచేత బాప్తిస్మము పొంద వలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపచెను గాని,"

15 "యేసు - ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది అని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతలాగు కానిచ్చెను."

16 "యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను; ఆ సమయమున ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట ఆయన చూచెను."

మత్తయి సువార్త 3:16 - Jesus\' Baptism
Jesus\' Baptism
17 "మరియు- ''ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను'' అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను."

<< ← Prev Top Next → >>