Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / మార్కు సువార్త

Bible - Telugu Bible OV, 1880

మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర నున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి

2 - ''మీ యెదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి యున్న యొక గాడిద పిల్ల కనబడును; దాని మీద ఎప్పుడును ఏ మనుష్యుడును కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి.

3 ఎవడైనను మీరెందుకీలాగు చేయుచున్నారని మిమ్ము నడిగిన యెడల - అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతను దానిని ఇక్కడికి తోలి పంపును'' అని చెప్పి వారిని పంపెను.

4 "వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టబడి యున్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,"

5 అక్కడ నిలిచియున్న వారిలో కొందరు - మీరేమిచేయుచున్నారు ? గాడిద పిల్లనెందుకు విప్పు చున్నారని వారి నడిగిరి.

6 అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.

7 వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను.

8 "అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి."

9 "మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును - జయము హోసన్నా, ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడు గాక,"

10 "వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి."

11 "ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడ బేతనియకు వెళ్ళెను."

12 మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని

13 "ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దాని మీద ఏమైనను దొరకునేమోయని వచ్చెను. దాని యొద్దకు వచ్చిచూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడ లేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము గాదు."

14 అందుకాయన - ''ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక'' అని చెప్పెను; ఇది ఆయన శిష్యులు వినిరి.

15 "వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయవిక్రయములు చేయు వారిని వెళ్ళగొట్ట నారంభించి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి,"

16 "దేవాలయముగుండ ఏ పాత్రనైనను ఎవనిని తేనియ్యకుండెను, మరియు"

17 ఆయన బోధించుచు - ''నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిర మనబడును అని వ్రాయబడలేదా ? అయితే దానిని మీరు దొంగల గుహగా చేసితిరి'' అనెను.

18 "శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదమాయని సమయము కొరకు చూచుచుండిరి"

19 సాయంకాల మైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను.

20 ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని యెండి యుండుట చూచిరి.

21 "అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని - బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను."

22 అందుకు యేసు వారితో ఇట్లనెను - ''మీరు దేవునియందు విశ్వాసముంచుడి;

23 ఎవడైనను ఈ కొండను చూచి - నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

24 అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.

25 "మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి యున్నయెడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వానిని క్షమించుడి,"

26 అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును''.

27 "వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి ఆయన దేవాలయములో తిరుగు చుండగా, ప్రధాన యాజకులును శాస్త్రులును పెద్దలును ఆయన యొద్దకు వచ్చి-"

28 నీవు ఏ అధికారము వలన ఈ కార్యములను చేయుచున్నావు ? వీటిని చేయుటకు ఈ అధికారము నీ కెవడిచ్చెననియడిగిరి.

29 "అందుకు యేసు ''నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకుత్తరమియ్యుడి; అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును."

30 యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా? మనుష్యుల నుండి కలిగినదా ? నాకు ఉత్తరమియ్యుడి'' అని చెప్పెను.

31 "అందుకు వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పిన యెడల,"

32 "ఆయన- అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును, మనుష్యుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తమరు ఆలోచించు కొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచిరి,"

33 గనుక ప్రజలకు భయపడి - ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు - ''ఏ అధికారము వలన ఈ కార్యములను చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పను'' అనెను.

<< ← Prev Top Next → >>