Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / లూకా సువార్త

Bible - Telugu Bible OV, 1880

మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

1 "ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా,"

2 పరిసయ్యులును శాస్త్రులును అది చూచి - ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.

3 "అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను ''మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల,"

4 "అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదకవెళ్ళడా?"

5 "అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి,"

6 "మీరు నాతో కూడ సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా."

7 అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబదితొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.''

8 ''ఏ స్త్రీ కైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెమును పోగొట్టుకొంటే ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా?

9 అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి. నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును గదా.

10 అటువలె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల యెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను'' అనెను.

11 మరియు ఆయన ఇట్లనెను. - ''ఒక మనుష్యునికి యిద్దరు కుమారు లుండిరి.

12 "వారిలో చిన్నవాడు తండ్రీ, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను."

13 "కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, దూరదేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్థిని దుర్యాపారము వలన పాడుచేసెను."

14 "అదంతయు ఖర్చుచేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు యిబ్బంది పడసాగి, వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత జేరెను."

15 అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.

16 "వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశ పడెను, కాని ఎవడును వానికేమియు ఇయ్యలేదు."

17 "అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు - నా తండ్రియొద్ద ఎంతో మంది కూలివాళ్ళకు అన్నము సమృద్దిగా నున్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను."

18 "నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను, నీ యెదుటను పాపము చేసితిని."

19 "ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను."

20 "వాడింక దూరముగా నున్నప్పుడు, తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి, వాని మెడ మీద పడి ముద్దుపెట్టుకొనెను."

21 "అప్పుడు ఆ కుమారుడు అతనితో - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను."

లూకా సువార్త 15:21 - The Return of the Prodigal Son
The Return of the Prodigal Son
22 "అయితే తండ్రి, తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి."

23 క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడుదము.

24 ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను. తప్పిపోయి దొరికెను అని చెప్పెను. అంతట వారు సంతోష పడసాగిరి.

25 "అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో నుండెను. వాడు పొలము నుండి వచ్చుచు యింటి దగ్గరకు రాగా వాద్యములును నాట్యములును జరుగుట విని,"

26 "దాసులలో ఒకనిని పిలిచి ఇది ఏమిటని అడుగగా,"

27 "ఆ దాసుడు అతనితో- నీ తమ్ముడు వచ్చి యున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను."

28 అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళ నొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను.

29 "అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోష పడునట్లు నీవు నాకెన్నడును ఒక మేక పిల్లనెనను ఇయ్యలేదు."

30 అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.

31 "అందుకతడు- కుమారుడా, నీవెల్లప్పుడును నాతో కూడ ఉన్నావు, నావన్నియు నీవి."

32 "మనము సంతోషించి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.''"

<< ← Prev Top Next → >>