Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / లూకా సువార్త

Bible - Telugu Bible OV, 1880

మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

1 "మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను - ''ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్థిని పాడుచేయు చున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా,"

2 అతడు వానిని పిలిపించి- నిన్ను గూర్చి నేను విను చున్న యీ మాటయేమిటి ? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను.

3 "ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహనిర్వాహకత్వము పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును ? త్రవ్వలేను, బిక్షమెత్త సిగ్గుపడుచున్నాను,"

4 నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియునను కొని

5 తన యజమానుని ఋణస్తులలో ఒక్కొక్కని పిలిపించి - నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను.

6 వాడు - నూరు మణుగుల నూనె అని చెప్పగా - నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పెను.

7 "తర్వాత వాడు- నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పగా, వానితో నీ చీటితీసుకొని యెనుబది తూములని వ్రాసుకొనుమని చెప్పెను."

8 "అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోకసంబంధులు తమ తరమును బట్టి చూడగా, యుక్తి పరులైయున్నారు.''"

9 "''అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను."

10 మిక్కిలి కొంచెములో నమ్మకముగా నున్నవాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా నుండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును

11 కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా నుండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?

12 మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా నుండని యెడల మీ సొంతమైనది మీకెవడిచ్చును ?

13 ఏ సేవకుడును యిద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణికరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరు'' అని చెప్పెను.

14 ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించు చుండగా

15 ఆయన- ''మీరు మనుష్యుల యెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.

16 యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడు చున్నాడు.

17 ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పిపోవుట కంటె ఆకాశమును భూమియు గతించి పోవుట సులభము.

18 తన భార్యను విడనాడి మరియొకతెను వివాహము చేసుకొను ప్రతివాడు వ్యభిచరించు చున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకొనువాడు వ్యభిచరించుచున్నాడు.''

19 ''ధనవంతుడొకుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు.

20 "లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై, ధనవంతుని యింటి వాకిట పడియుండి,"

21 అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాకకుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.

22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.

23 అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున అనుకొని యున్న లాజరును చూచి-

లూకా సువార్త 16:23 - The Rich Man and Lazarus
The Rich Man and Lazarus
24 "తండ్రివైన అబ్రాహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను."

25 "అందుకు అబ్రాహాము- కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీ కిష్టమైన సుఖము అనుభవించితివి. ఆలాగుననే లాజరు కష్టము ననుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు"

26 "అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాల కుండునట్లును అక్కడవారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడియున్నదని చెప్పెను."

27 "అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నాకు అయిదుగురు సహోదరులున్నారు;"

28 వారును ఈ వేదన కరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వానిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.

29 "అందుకు అబ్రాహాము - వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు. వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా,"

30 "అతడు - తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినయెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను."

31 అందుకతడు - మోషేయు ప్రవక్తలును చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు'' అని అతనితో చెప్పెననెను.

<< ← Prev Top Next → >>