Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / లూకా సువార్త

Bible - Telugu Bible OV, 1880

మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

1 "ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి,"

2 "సమాధి ముందరుండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, గాని"

3 ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.

4 "ఇందును గూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములను ధరించిన యిద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి"

5 వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు - సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు?

6 "ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి యున్నాడు. ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు"

7 "మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, మూడవ దినమందు లేవవలసి యున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి అని వారితో అనిరి"

8 అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని.

9 సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కిన వారందరికిని తెలియజేసిరి.

10 ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా - మగ్దలేనే మరియయు యొహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ నున్న ఇతర స్త్రీలును.

11 అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు.

12 "అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరుగెత్తికొని పోయి వంగి చూడగా, నార బట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను."

13 "ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున నున్న ఎమ్మాయు అను గ్రామమునకు వెళ్ళుచు,"

14 జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి.

15 "వారు సంభాషించుచు ఆలోచించు కొనుచుండగా, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడ నడిచెను."

16 అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మాయబడెను.

17 "ఆయన ''మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమి?'' అని అడుగగా, వారు దుఃఖముఖులై నిలిచిరి."

18 "వారిలో క్లెయోపా అనువాడు - యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా? అని ఆయన నడిగెను."

లూకా సువార్త 24:18 - Disciples on Road to Emmaus
Disciples on Road to Emmaus
19 "ఆయన - ''అవి ఏవి'' అని వారి నడుగగా, - ''వారు- ''నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే; ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను."

20 "మన ప్రధానయాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించిరో నీకు తెలియదా?"

21 ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే యని మేము నిరీక్షించి యుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను.

22 "అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి, ఆయన దేహమును కానక వచ్చి,"

23 కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి యున్నాడని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.

24 "మాతోకూడ నున్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, గాని ఆయనను చూడలేదు'' అని ఆయనతో చెప్పిరి."

25 "అందుకాయన - ''అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,"

26 "క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా?'' అని వారితో చెప్పి,"

27 మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.

28 "ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంక కొంతదూరము వెళ్ళునట్లు అగపడగా,"

29 "వారు - సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది మాతో కూడ ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడ నుండుటకు లోపలికి వెళ్ళెను."

30 "ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా,"

31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తు పట్టిరి. అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.

32 అప్పుడు వారు - ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

33 "ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా పదునొకండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి,"

34 ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని

35 త్రోవలో జరిగినసంగతులును ఆయన రొట్టె విరుచుట వలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.

36 వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి - ''మీకు సమాధానమవుగాక'' అని వారితో అనెను.

37 అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి.

38 అప్పుడాయన - ''మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల ?

39 నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి.; నన్ను పట్టి చూడుడి. నా కున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలును మాంసమును భూతమునకు ఉండవు'' అని చెప్పి

40 తన చేతులను పాదములను వారికి చూపెను.

41 "అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఆయన - ''ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా?'' అని వారి నడిగెను."

42 వారు కాల్చిన చేపముక్కను ఆయనకిచ్చిరి.

43 ఆయన దానిని తీసుకొని వారి యెదుట భుజించెను.

44 అంతట ఆయన - ''మోషే ధర్మ శాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద నుండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి'' అని వారితో చెప్పెను.

45 "అప్పుడు వారు లేఖనములను గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సు తెరచి,"

46 "''క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు,"

47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

48 ఈ సంగతులకు మీరే సాక్షులు.

49 ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడి'' అని వారితో చెప్పెను.

50 ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.

51 ఆయన వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.

లూకా సువార్త 24:51 - Jesus Taken Up into Heaven
Jesus Taken Up into Heaven
52 "వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి,"

53 యెడతెగక దేవాలయములో నుండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.

<< ← Prev Top Next >>