Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / యోహాను సువార్త

Bible - Telugu Bible OV, 1880

లూకా సువార్త యోహాను సువార్త అపొస్తలుల కార్యములు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

1 యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యుడొకుండెను.

2 "అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి - బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను."

3 అందుకు యేసు అతనితో - ''ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.

4 "అందుకు నీకొదేము - ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? అని ఆయనను అడుగగా,"

5 యేసు ఇట్లనెను - ''ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6 "శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది."

7 మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8 "గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే యున్నాడు'' అనెను."

యోహాను సువార్త 3:8 - Jesus Teaches Nicodemus
Jesus Teaches Nicodemus
9 "అందుకు నీకొదేము - ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా,"

10 యేసు ఇట్లనెను -''నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?

11 "మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

12 భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఏలాగు నమ్ముదురు ?

13 "మరియు పరలోకము నుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునులేడు."

14 "అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో,"

15 అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.

16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.

18 ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను.

19 ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్ఢవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

20 "దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు."

21 సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.

22 అటుతరువాత యేసు తన శిష్యులలో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను.

23 సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహానుకూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి.

24 యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండలేదు.

25 "శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను,"

26 "గనుక వారు యోహాను నొద్దకు వచ్చి - బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీవెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, ఇదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి."

27 అందుకు యోహాను ఇట్లనెను - తనకు పరలోకమునుండి అనుగ్రహింప బడితేనేగాని ఎవడును ఏమియు పొందనేరడు.

28 "నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షలు."

29 "పెండ్లికుమార్తె గలవాడు పెండ్లికుమారుడు, అయితే నిలువబడి పెండ్లికుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమై యున్నది."

30 "ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది."

31 పై నుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చువాడు అందరికి పైగానుండి

32 "తాను కన్నవాటిని గూర్చియు, విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు."

33 ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు.

34 ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలతలేకుండ ఆత్మ ననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.

35 తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి యున్నాడు.

36 "కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును."

<< ← Prev Top Next → >>