Bible, అపొస్తలుల కార్యములు, అధ్యాయం 21. is available here: https://www.bible.promo/chapters.php?id=11039&pid=46&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / అపొస్తలుల కార్యములు

Bible - Telugu Bible OV, 1880

యోహాను సువార్త అపొస్తలుల కార్యములు రోమీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

1 "మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితిమి"

2 అప్పుడు ఫేనీకేకు వెళ్ళబోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి.

3 "కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి, సిరియ వైపుగా వెళ్ళి, తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను."

4 మేమక్కడ ఉన్న శిష్యులను కనుగొని ఏడు దినములక్కడ నుంటిమి. వారు - నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి.

5 "ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను, పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లాని ప్రార్థన చేసి ఒకరియొద్ద నొకరము సెలవు పుచ్చుకొంటిమి."

6 "అంతట మేము ఓడ ఎక్కితిమి, వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్లిరి."

7 "మేము తూరునుండి చేసిన ప్రయాణమును ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి."

8 "మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, ఏడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి."

9 "కన్యకలుగా నున్న నలుగురు కుమార్తెలతనికుండిరి, వారు ప్రవచించువారు."

10 "మేమనేక దినము లక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదయనుండి వచ్చెను."

11 "అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని, తన చేతులను కాళ్లను కట్టుకొని - యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను."

12 "ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును - యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని,"

13 పౌలు - ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకును మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.

14 అతడు ఒప్పుకొననందున మేము - ప్రభువు చిత్తము జరుగును గాక అని ఊరకుంటిమి.

15 ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూష లేమునకు ఎక్కిపోతిమి.

16 "మరియు కైసరయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా నుండి కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశ్యముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడ వచ్చిరి."

17 మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి.

18 "మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా, పౌలు మాతో కూడ యాకోబునొద్దకు వచ్చెను."

19 "అతడు వారికి కుశలమడిగి, తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను."

20 "వారు విని, దేవుని మహిమ పరిచి అతని చూచి - సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావు గదా? వారందరును ధర్మశాస్త్రమునందు ఆసక్తి గలవారు."

21 "అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పట వలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు."

22 కావున మనమేమి చేయుదము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు.

23 కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడి యున్న నలుగురు మనుష్యులు మా యొద్దనున్నారు.

24 "నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడ శుద్ధిచేసుకొని వారు తల క్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యెడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి వారు వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడచుకొనుచున్నావనియు తెలిసికొందురు."

25 "అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి - వారు విగ్రహముల కర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మానవలసి నదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి."

26 "అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని పోయి, వారితో కూడ శుద్ధి చేసుకొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతి వానికొరకు కానుక అర్పించువరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపెను."

27 "ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంత ముగా పట్టుకొని"

28 ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి. ప్రజలకును ధర్మ శాస్త్రమునకును ఈ స్థలమునకు విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి.

29 "ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును, అతనితో కూడ పట్టణములో అంతకు ముందు వారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతనికి తీసుకొని వచ్చెనని ఊహించిరి."

30 "పట్టణమంతయు గలిబిలిగా నుండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తుకొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను."

31 వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగానున్నదని పటాలపు పైఅధికారికి వర్తమానము వచ్చెను.

32 "వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట బెట్టుకొని వారి యొద్దకు పరుగెత్తి వచ్చెను; వారు పై అధికారిని, సైనికులను, రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి."

33 "పైఅధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి, - ఇతెవడు? ఏమి చేసెనని అడుగగా,"

34 "సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలు వేయుచున్నప్పుడు, అల్లరి చేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను."

35 పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపు గూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతని మోసికొని పోవలసి వచ్చెను.

36 ఏలయనగా - వానిని చంపుమని జన సమూహము కేకలు వేయుచు వెంబడించెను.

37 వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై యుండగా అతడు పై అధికారిని చూచి నేను నీతోనొక మాట చెప్పవచ్చునా? అని అడిగెను. | అందుకతడు - గ్రీకు భాష నీకు తెలియునా?

38 "ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేల మంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టు కొనిపోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను."

39 అందుకు పౌలు - నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను.

40 అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను -

<< ← Prev Top Next → >>