Bible, రోమీయులకు, అధ్యాయం 12. is available here: https://www.bible.promo/chapters.php?id=11058&pid=47&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / రోమీయులకు

Bible - Telugu Bible OV, 1880

అపొస్తలుల కార్యములు రోమీయులకు 1 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 "కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యూగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది."

2 "మీరు, ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి, నూతన మగుటవలన రూపాంతరము పొందుడి."

3 "తన్నుతాను ఎంచుకొన తగిన దాని కంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధి కలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోను చెప్పుచున్నాను."

4 "ఒక్క శరీరములో మనకు అనేక అవయవములున్నను, ఈ అవయవములన్నిటికి ఒక్కటే పని ఏలాగు ఉండదో,"

5 "ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా నుండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము."

6 "మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై యున్నాము గనుక,"

7 "ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,"

8 "బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను."

9 "మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్ఢదానిని అసహ్యించుకొని, మంచి దానిని హత్తుకొని యుండుడి."

10 "సహోదర ప్రేమ విషయములో ఒకరి యందొకరు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి."

11 "ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై, ప్రభువును సేవించుడి."

12 "నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల గలిగి యుండుడి."

13 "పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, శ్రద్ధగా అతిధ్యము ఇచ్చుచుండుడి."

14 మిమ్మును హింసించు వారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.

15 సంతోషించు వారితో సంతోషించుడి.

16 "ఏడ్చువారితో ఏడువుడి ఒకనితో నొకడు మనస్సు కలిసి యుండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక, తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతుల మని అనుకొనవద్దు."

17 కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి.

18 శక్యమైతే మీచేత నైనంతమట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

19 "ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. - పగతీర్చుట నాపని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది."

20 "కాబట్టి నీ శత్రువు ఆకలిగొని యుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని యుంటే దాహమిమ్ము.; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు."

21 కీడువలన జయింపబడక మేలు చేత కీడును జయించుము.

<< ← Prev Top Next → >>