Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 కొరింథీయులకు

Bible - Telugu Bible OV, 1880

రోమీయులకు 1 కొరింథీయులకు 2 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.

2 "ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఈలాటి కార్యము జేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారుకారు."

3 "నేను దేహ విషయమై దూరముగానున్నను, ఆత్మ విషయమై సమీపముగా నుండి మీతో కూడ ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసినవానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి యున్నాను."

4 "ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు, శరీరేచ్ఛలు నశించుటకై,"

5 "మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను."

6 మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?

7 "మీరు పులిపిండిలేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను,"

8 "గనుక పాతదైన పులిపిండితో నైనను, దుర్మార్గతయును దుష్టత్వమునను పులిపిండితో నైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము."

9 జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి యుంటిని.

10 "అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతో నైనను, దోచుకొను వారితో నైనను, విగ్రహారాధికులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసివచ్చును గదా?"

11 "ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడైవడైనను, జారుడుగాని, లోభిగాని, విగ్రహారాధికుడుగాని, తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని, దోచుకొనువాడు గాని అయియున్నయెడల అట్టివానితో సాంగత్యము చేయుకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను."

12 వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేల? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని

13 మీరు లోపటివారికి తీర్పు తీర్చు వారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.

<< ← Prev Top Next → >>