Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 కొరింథీయులకు

Bible - Telugu Bible OV, 1880

రోమీయులకు 1 కొరింథీయులకు 2 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 "విగ్రహార్పిత సమస్యలు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము :- మనమందరము జ్ఞానము గలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ జేయును గాని, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును."

2 "ఒకడు తన కేమైనను తెలియుననుకొని యుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనిన వాడు కాడు."

3 ఒకడు దేవుని ప్రేమించినయెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.

4 "కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము - లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము."

5 దేవతలనబడిన వారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

6 "ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము."

7 అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్ధములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవి అని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.

8 "భోజనమును బట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినక పోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు."

9 అయినను మీకు కలిగియున్న ఈ స్వాతంత్య్రమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.

10 "ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా, ఒకడు చూచిన యెడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్ధములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?"

11 అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును.

12 "ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగు చున్నారు."

13 "కాబట్టి భోజనపదార్ధమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన యెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగ జేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను."

<< ← Prev Top Next → >>