Bible, 1 కొరింథీయులకు, అధ్యాయం 11. is available here: https://www.bible.promo/chapters.php?id=11073&pid=48&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 కొరింథీయులకు

Bible - Telugu Bible OV, 1880

రోమీయులకు 1 కొరింథీయులకు 2 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.

2 "మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను."

3 "ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడంనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను."

4 "ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు, తన తలను అవమానపరచును."

5 ఏ స్త్రీ తన తలమీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.

6 స్త్రీ ముసుగు వేసుకొననియెడల ఆమె తలవెండ్రుకలు కత్తిరించు కొనవలెను. కత్తిరించు కొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను.

7 "పురుషుడైతే దేవుని పోలికయు, మహియునై యున్నాడు గనుక తన తలమీద ముసుగు వేసుకొన కూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది."

8 ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు.

9 మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు.

10 ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.

11 "అయితే ప్రభువు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు."

12 స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి.

13 "మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా?"

14 పురుషుడు తలవెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును గదా?

15 స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.

16 ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన యెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలిసికొనవలెను.

17 మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడివచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు.

18 మొదటి సంగతి ఏమనగా- మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.

19 మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు.

20 మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు.

21 ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె మరియొకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును. మరియొకడు మత్తుడవును.

22 ఇదేమి ? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా ? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచెదరా? మీతో ఏమి చెప్పుదును ? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా ? మెచ్చను.

23 "నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఒక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి,"

24 "దానిని విరిచి, ఇది మీకొరకైన నా శరీరము - నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను."

25 "ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను."

26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర లోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

27 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును.

28 "కాబట్టి ప్రతి మనుష్యుడు, తన్ను తాను పరీక్షించు కొనవలెను. ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను."

29 ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

30 "ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు, చాలమంది నిద్రించుచున్నారు."

31 అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పు పొందక పోదుము.

32 మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.

33 "కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి."

34 మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు ఎవడైనను ఆకలి గొనిన యెడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.

<< ← Prev Top Next → >>