Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 కొరింథీయులకు

Bible - Telugu Bible OV, 1880

రోమీయులకు 1 కొరింథీయులకు 2 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 "మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియ పరచుచున్నాను."

2 "మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని యున్నయెడల ఆ సువార్త వలననే మీరు రక్షణపొందువారై యుందురు."

3 "నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను."

4 లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను

5 ఆయన కేఫాకును తరువాత పన్నెండుగురికిని కనబడెను.

6 "అటుపిమ్మట ఐదువందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి."

7 "తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను."

8 అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను.

9 ఏలయనగా నేను ఆ అపొస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడను కాను.

10 "అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే."

11 "నేనైననేమి, వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి."

12 క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు - మృతుల పునరుత్థానము లేదని ఏల చెప్పుచున్నారు?

13 "మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తు కూడ లేపబడి యుండలేదు."

14 మరియు క్రీస్తు లేపబడి యుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మీ విశ్వాసమును వ్యర్థమే.

15 "దేవుడు క్రీస్తును లేపెనని, ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి యున్నాము గదా? మృతులు లేపబడని యెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యులముగా అగపడుచున్నాము."

16 మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడ లేపబడ లేదు.

17 "క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు."

18 "అంతేకాదు, క్రీస్తు నిద్రించిన వారును నశించిరి."

19 ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.

20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి యున్నాడు.

21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.

22 "ఆదామునందు అందరు ఏలాగు మృతిపొంది యున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రతికింపబడుదురు."

23 "ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింప బడుదురు."

24 "అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును."

25 "ఎందుకనగా, తన శత్రువులనదరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను."

26 కపట నశింపచేయబడు శత్రువు మరణము.

27 "దేవుడు సమస్తమును, క్రీస్తు పాదముల క్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప, సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే."

28 మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.

29 ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు ? మృతులే మాత్రమును లేపబడనియెడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేల ?

30 మరియు మేము గడియ గడియకు ప్రాణ భయముతో నుండనేల?

31 "సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగియున్న అతిశయము తోడు - నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును."

32 "మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి ? మృతులు లేపబడని యెడల, రేపు చనిపోవుదుము గనుక తిందము, త్రాగుదము."

33 మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును.

34 "నీతి ప్రవర్తన గలవారై మేల్కొని, పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను."

35 అయితే మృతులేలాగు లేతురు ? వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును.

36 "ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనేగాని బ్రతికింపబడదు గదా?"

37 "నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని, పుట్టబోవు శరీరమును విత్తుట లేదు."

38 "అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమిచ్చుచున్నాడు, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు."

39 "మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు."

40 "మరియు ఆకాశ వస్తురూపములు కలవు, భూ వస్తురూపములు కలవు; ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపములు కలవు."

41 "సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును, మరియొక నక్షత్రమునకును భేదము కలదు గదా ?"

42 మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును.

43 ఘన హీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును.

44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడ ఉన్నది.

45 "ఇందు విషయమై, - - ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయెను."

46 "ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది గాదు, పకృతి సంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మ సంబంధమైనది."

47 మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చిన వాడు.

48 మంటినుండి పుట్టిన వాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులును అట్టివారే.

49 మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము.

50 "సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు."

51 "ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మనమందరము నిద్రించము గాని నిముషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగ గానే మనమందరము మార్పు పొందుదుము."

52 "బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము."

53 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొన వలసియున్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొన వలసియున్నది.

54 "ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు- విజయమందు మరణము మ్రింగువేయబడెను అని వ్రాయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును"

55 "ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా?"

56 మరణపు ముల్లు పాపము; పాపముకున్న బలము ధర్మశాస్త్రమే.

57 అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.

58 "కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధినందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి."

<< ← Prev Top Next → >>