Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 2 కొరింథీయులకు

Bible - Telugu Bible OV, 1880

1 కొరింథీయులకు 2 కొరింథీయులకు గలతీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

1 "దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకును, అకయ యందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది."

2 మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

3 "కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియునైన దేవుడు స్తుతింపబడను గాక."

4 "దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో యెట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును అదరించుచున్నాడు."

5 "క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది."

6 "మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేము కూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది."

7 "మీరు శ్రమలలో ఏలాగు పాలివారై యున్నారో, అలాగే ఆదరణలోను పాలివారై యున్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది."

8 "సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మా కిష్టములేదు; అదేదనగా- మేము బ్రతుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన క్రుంగిపోతిమి."

9 "మరియు మృతులను లేపు దేవుని యందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణ మగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగియుండెను:"

10 "ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను. ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై యున్నాము."

11 "అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును."

12 "మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానముననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు, విశేషముగా మీ యెడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే."

13 "మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, మరేవియు మీకు వ్రాయుటలేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము."

14 "మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయకారణమైయుందుమని, మీరు కొంతమట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు."

15 "మరియు, ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీ యొద్దకు వచ్చి"

16 "మీయొద్ద నుండి మాసిదోనియకు వెళ్ళి, మాసిదోనియ నుండి మరల మీయొద్దకు వచ్చి, మీ చేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని."

17 "కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తునుగా నడుచుకొంటినా ? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్లు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?"

18 దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.

19 మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవునను వాడైయున్నాడు.

20 దేవుని వాగ్దానములు ఎన్నియైనను అవన్నియు క్రీస్తునందు అవుననట్టుగానే యున్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి.

21 మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.

22 "ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు."

23 మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను .

24 మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఈలాగు చెప్పుట లేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు.

<< Prev Top Next → >>