1 నిష్కపటమును బోధించుట యందలి ధైర్యము కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.
2 "అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి యున్నాము."
3 మా సువార్త మరుగు చేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగు చేయబడియున్నది.
4 "దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను."
5 - ''అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక '' అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తు నందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.
6 "గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని, క్రీస్తుయేసుని గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము."
7 అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.
8 ఎటుబోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయము లోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;
9 తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.
10 "యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము."
11 "ఏలయనగా, యేసు యొక్క జీవము కూడ మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచ బడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము."
12 కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకమగుచున్నవి.
13 "కృప ఎక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై యున్నవి. కాగా,"
14 విశ్వసించితిని గనుక మాటలాడితిని
15 "అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడ లేపి, మీతో కూడ తన యెదుట నిలువబెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము."
16 "కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు."
17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక
18 క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. |