Bible, 2 కొరింథీయులకు, అధ్యాయం 12. is available here: https://www.bible.promo/chapters.php?id=11090&pid=49&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 2 కొరింథీయులకు

Bible - Telugu Bible OV, 1880

1 కొరింథీయులకు 2 కొరింథీయులకు గలతీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

1 అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడ వలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును.

2 "క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదు నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడనో నేనెరుగను. అది దేవునికే తెలియును."

3 అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసు లోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలువినెను.

4 "ఆ మాటలు మనుష్యుడు పలుక గూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగును, అది దేవునికే తెలియును."

5 అట్టి వాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనత యందే గాక వేరు విధముగా అతిశయింపను.

6 అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నావలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమోయని అతిశయించుట మానుకొనుచున్నాను.

7 "నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేనత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను."

8 అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.

9 అందుకు - నా కృప నీకు చాలును. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తమును విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును.

10 నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. పౌలు తన అతిశయమును గూర్చి తిరిగి చెప్పుట

11 "నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏ మాత్రపు వాడను కాక పోయినను మిక్కిలి శ్రేష్టులైన ఈ అపొస్తలుల కంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను."

12 సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను.

13 "నేను మీకు భారముగా ఉండక పోతినను విషయములో తప్ప, మరి ఏ విషయములో మీరితర సంఘముల కంటె తక్కువ వారైతిరి ? నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి."

14 "ఇదిగో, ఈ మూడవ సారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తలిదండ్రుల కొరకు గాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా?"

15 కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయ పరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?

16 అది ఆలాగుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో.

17 నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా?

18 మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా ? మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగుజాడలయందే నడుచుకొనలేదా?

19 "మేమింత వరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొను చున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తు నందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభి వృద్ధికొరకు ఇవన్నియు చెప్పుచున్నాము."

20 "ఎందుకనగా, ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నా కిష్టులుగా ఉండరేమో ననియు, నేను మీ కిష్టునుగా నుండునేమో ననియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుస గుస లాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండునేమో అనియు,"

21 "నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను."

<< ← Prev Top Next → >>