Bible, గలతీయులకు, అధ్యాయం 3. is available here: https://www.bible.promo/chapters.php?id=11094&pid=50&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / గలతీయులకు

Bible - Telugu Bible OV, 1880

2 కొరింథీయులకు గలతీయులకు ఎఫెసీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6

1 "దేవుని అంగీకరించుటకు మూలము విశ్వాసమే, గాని ధర్మశాస్త్రము కాదు ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల యెదుట ప్రదర్శింపబడెను గదా?"

2 ఇది మాత్రమే మీ వలన తెలిసికొన గోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా? లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?

3 "మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?"

4 వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా?

5 "ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలననా? లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు ?"

6 "అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను."

7 కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.

8 దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి - నీయందు అన్యజను లందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.

9 కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.

10 "ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు, ఎందుకనగా - ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది."

11 ధర్మశాస్త్రము చేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా - నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.

12 ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.

13 "ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను;"

14 ఇందునుగూర్చి - మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

15 "సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడు చేసిన ఒడంబడిక యైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు."

16 "అబ్రాహామునకును అతని సంతానమునకును ఆ వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు-సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చిన అన్నట్టే - నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు."

17 "నేను చెప్పున దేమనగా - నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్ధానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు."

18 ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగిన యెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను.

19 ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు? ఎవనికి ఆ వాగ్ధానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతిక్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.

20 మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే.

21 "ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయశక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్నయెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని,"

22 "యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను."

23 "విశ్వాసము వెల్లడికాక మునుపు, ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైనవారమైతిమి."

24 కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

25 అయితే విశ్వాసము వెల్లడి ఆయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.

26 యేసుక్రీస్తు నందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.

27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.

28 "ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు."

29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

<< ← Prev Top Next → >>