Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / ఎఫెసీయులకు

Bible - Telugu Bible OV, 1880

గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6

1 ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తుయేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను.

2 "మీ కొరకు నా కనుగ్రహించబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును, గృహనిర్వాహకత్వమును గూర్చి మీరు విని యున్నారు."

3 ఎట్లనగా- క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.

4 మీరు దానిని చదివిన యెడల. దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు.

5 ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులుగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడ లేదు.

6 "ఈ మర్మమేదనగా - అన్యజనులు సువార్త వలన క్రీస్తుయేసునందు యూదులతోపాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే."

7 దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

8 దేవుడు మన ప్రభువైన క్రీస్తుయేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో

9 "ప్రధానులకును, అధికారులకును, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి,"

10 "శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన"

11 "దేవునియందు పూర్వ కాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను."

12 ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగియున్నవి.

13 కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను; ఇవి మీకు మహిమ కరములైయున్నవి. సువార్తను తెలిసికొనవలెనని పౌలు ప్రార్థన

14 "ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఈ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి యెదుట నేను మోకాళ్ళాని,"

15 మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి

16 "ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లు గాను,"

17 "క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లు గాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు,"

18 "మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించు కొనుటకును,"

19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

20 "మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటి కంటెను,"

21 "ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయశక్తి గలదేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక, ఆమేన్."

<< ← Prev Top Next → >>