Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / ఎఫెసీయులకు

Bible - Telugu Bible OV, 1880

గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6

1 "కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొనుటయందు శ్రద్ధ కలిగినవారై,"

2 "ప్రేమతో ఒకని నొకడు సహించుచు,"

3 "మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడచుకొనవలెనని, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను."

4 "శరీరమొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి."

5 "ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే, బాప్తిస్మమొక్కటే."

6 "అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై, అందరి ద్వారాను, అందరిలోను వ్యాపించి అందరిలోను ఉన్నాడు."

7 అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను.

8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.

9 ఆరోహణమాయెననగా. ఆయన భూమియొక్క క్రింది భాగములకు మొదట దిగెనని అర్థమిచ్చుచున్నది గదా?

10 దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటి కంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.

11 "మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది,"

12 "సంపూర్ణ పురుషుల మగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారమగువరకు ఆయన ఇలాగు నియమించెను."

13 "పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులను, గాను కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులను గాను నియమించెను."

14 "అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక,"

15 "ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము."

16 "ఆయన శిరస్సయి యున్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో నున్న ప్రతి అవయవము తన తన పరిమాణముచొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ జేసికొనుచున్నది."

17 కాబట్టి అన్యజనులు నడచుకొనునట్లు మీరిక మీదట నడచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.

18 "వారైతే అంధకారమైన మనస్సు గలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, తమ మనస్సునకు కలిగిన, వ్యర్థత ననుసరించి నడచుకొను చున్నారు."

19 వారు సిగ్గు లేని వారైయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

20 అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు

21 "ఉపదేశింపబడిన వారైన యెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారు కారు."

22 "కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని,"

23 "మీ చిత్త వృత్తియందు నూతనపరచబడిన వారై,"

24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.

25 "మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధ మాడుట మాని, ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను."

26 కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచి యుండకూడదు.

27 "అపవాదికి చోటియ్యకుడి, దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము"

28 తన చేతులతో మంచి పని చేయుచు కష్టపవలెను.

29 "వినువారికి మేలు కలుగు నట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని, దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి."

30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి; విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింప బడియున్నారు.

31 "సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి."

32 ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరి నొకరు క్షమించుడి.

<< ← Prev Top Next → >>