Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / కొలస్సయులకు

Bible - Telugu Bible OV, 1880

ఫిలిప్పీయులకు కొలస్సయులకు 1 థెస్సలొనీకయులకు

అధ్యాయం 1 2 3 4

1 "యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులయెడల చేయుడి."

2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.

3 మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్ల డిపరచునట్లు

4 వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మాకొరకు ప్రార్థించుడి.

5 "సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచు కొనుడి."

6 ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తర మియ్యవలెనో అది మీరు తెలిసి కొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.

7 "ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నాతోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును."

8 "మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును, అతనిని, అతనితోకూడ నమ్మకమైన ప్రియసహోదరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను;"

9 ఇతడు మీయొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు.

10 "నాతో కూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు; ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి."

11 "మరియు యూస్తు అను యేసు కూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపనివారై యున్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగెను."

12 "మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు."

13 "ఇతడు మీకొరకును, లవొదికయ వారికొరకును, హియెరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను."

14 "లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు."

15 "లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి."

16 ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.

17 మరియు - ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.

18 పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక.

<< ← Prev Top Next >>