Bible, 1 థెస్సలొనీకయులకు, అధ్యాయం 3. is available here: https://www.bible.promo/chapters.php?id=11114&pid=54&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 థెస్సలొనీకయులకు

Bible - Telugu Bible OV, 1880

కొలస్సయులకు 1 థెస్సలొనీకయులకు 2 థెస్సలొనీకయులకు

అధ్యాయం 1 2 3 4 5

1 "కాబట్టి ఇక సహింప జాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి,"

2 "ఈ శ్రమల వలన ఎవడును కదిలింప బడకుంటునట్లు మిమ్మును స్థిరపరచుటకును,"

3 "మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్దన్నప్పుడు, మనము శ్రమ అనుభవింప వలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా-ఆలాగే జరిగింది."

4 ఇది మీకును తెలియును; అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.

5 "ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒక వేళ శోధించెనేమో యనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు మీ విశ్వాసము తెలిసికొనవలెనని అతనిని పంపితిని."

6 "తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఏలాగు చూడ నపేక్షించుచున్నామో ఆలాగే మీరు కూడ మమ్మును చూడనపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను."

7 "అందుచేత సహోదరులారా, మా యిబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి."

8 ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే.

9 "మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,"

10 మన దేవుని యెదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము?

11 మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక.

12 "మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు,"

13 "మన తండ్రియైన దేవుని యెదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, మేము మీ యెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్థిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్థిల్లునట్లు ప్రభువు దయచేయును గాక."

<< ← Prev Top Next → >>