Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 తిమోతికి

Bible - Telugu Bible OV, 1880

2 థెస్సలొనీకయులకు 1 తిమోతికి 2 తిమోతికి

అధ్యాయం 1 2 3 4 5 6

1 "మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణయైన క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తుయేసు యొక్క అపొస్తలుడైన పౌలు"

2 "విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవుని నుండియు, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు, కనికరమును సమాధానమును నీకు కలుగును గాక."

3 "నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలును మితము లేని వంశావళులును,"

4 "విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి కనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి యుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను."

5 "ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన హృదయమునుండి కలుగు ప్రేమయే."

6 "కొందరు వీటిని మానుకొని, తొలగిపోయి తాము చెప్పువాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపక పోయినను,"

7 ధర్మశాస్త్రోపదేశకుడై యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.

8 "అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము,"

9 "ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును, భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును,"

10 "మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్యచోరులకును అబద్ధికులకును,"

11 "అప్రమాణికులకును, హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల అట్టివానికిని నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము."

12 "పూర్వము దూషకుడును హింసకుడను హానికరుడనైన నన్ను,"

13 తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడ నైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనిరింపబడితిని.

14 "మరియు మన ప్రభువు యొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను."

15 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.

16 అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరచునట్లు నేను కనికరింపబడితిని.

17 "సకలయుగములలో రాజైయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక, ఆమేన్."

18 "నా కుమారుడవైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను."

19 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయినవారివలె చెడియున్నారు.

20 "వారిలో హుమెనైయను, అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని."

<< Prev Top Next → >>