Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / తీతుకు

Bible - Telugu Bible OV, 1880

2 తిమోతికి తీతుకు ఫిలేమోనుకు

అధ్యాయం 1 2 3

1 "అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,"

2 "ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగమాడని వారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము."

3 "ఎందుకనగా, మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై ఒకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని,"

4 "మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు,"

5 "మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుటద్వారాను మనలను రక్షించెను."

6 "మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై"

7 ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తుద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను.

8 ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవైయున్నవి గాని

9 అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును నిష్ ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.

10 మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము.

11 అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.

12 నీకొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించుకొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.

13 ధర్మశాస్త్రవేదియైన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము; వారికేమియు తక్కువ లేకుండ చూడుము.

14 మనవారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమునుబట్టి సమయోచితముగా సత్ క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను.

15 నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడై యుండును గాక.

<< ← Prev Top Next >>