Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / హెబ్రీయులకు

Bible - Telugu Bible OV, 1880

ఫిలేమోనుకు హెబ్రీయులకు యాకోబు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

1 క్రీస్తు అన్ని విషయములలోను శ్రేష్టుడు కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.

2 "ఎందుకనగా, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా,"

3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?

4 "అట్టి రక్షణ ప్రభువు బోధించుటచేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియల చేతను, మహత్కార్యములచేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను, వారితోకూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను."

5 మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.

6 అయితే ఒకడు ఒకచోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు - నీవు మనుష్యుని జ్ఞాపకం చేసికొనుటకు వాడేపాటివాడు?

7 "నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి, నీ చేతి పనుల మీద వానికధికారము అనుగ్రహించితివి,"

8 "వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచుకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని,"

9 "దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము."

10 "ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును."

11 పరిశుద్ధ పరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక

12 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను.

13 "మరియు- నేనాయనను నమ్ముకొని యుందును అనియు, - ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు"

14 "కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింప జేయుటకును,"

15 "జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను."

16 "ఏలయనగా, ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు."

17 "కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును, నమ్మకమును గల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను."

18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు.

<< ← Prev Top Next → >>