Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / హెబ్రీయులకు

Bible - Telugu Bible OV, 1880

ఫిలేమోనుకు హెబ్రీయులకు యాకోబు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

1 ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగ కుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు.

2 ఆలాగు చేయగలిగిన యెడల సేవించు వారొక్క సారే పరిశుద్ధ పరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా?

3 అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నది.

4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము-

5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు- బలియు అర్పణము నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి.

6 పూర్ణహోమములును పాప పరిహారార్థ బలులును నీ కిష్టమైనవి కావు.

7 "అప్పుడు నేను గ్రంథపుచుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము- దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని."

8 "- బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరిహారార్ధ బలులును నీవు కోరలేదనియు, అవి నీ కిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత,"

9 ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో- నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడు చున్నవి. ఆ రెండవ దానిని స్ధిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్క సారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడియున్నాము.

11 "మరియు ప్రతి యాజకుడు దిన దినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును."

12 "ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి,"

13 అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.

14 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచ బడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

15 ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడ మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు.

16 "ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే- నా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత,"

17 వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.

18 వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్ధ బలి ఇకను ఎన్నడు ఉండదు.

19 "సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్టించిన మార్గమున, అనగా నూతనమై నదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున,"

20 "ఆయన రక్తమువలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,"

21 "దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,"

22 "మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము."

23 వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.

24 "కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు,"

25 ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.

26 "మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధి పూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని,"

27 "న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును."

28 "ఎవడైనను మోషే ధర్మ శాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు."

29 "ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును ?"

30 "పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా?"

31 జీవముగల దేవుని చేతిలో పుట భయంకరము ధైర్యముతో కొనసాగించుకొనుట కొరకైన హెచ్చరికలు

32 "అయితే మీరు వెలిగింపబడిన మీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి."

33 "ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరి పడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభవించినవారితో పాలివారలైతిరి."

34 "ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి."

35 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.

36 "మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైయున్నది."

37 "ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును."

38 నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినయెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.

39 అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.

<< ← Prev Top Next → >>