Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / యాకోబు

Bible - Telugu Bible OV, 1880

హెబ్రీయులకు యాకోబు 1 పేతురు

అధ్యాయం 1 2 3 4 5

1 "నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటముగలవారై యుండకుడి."

2 "ఏలాగనగా, బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజ మందిరము లోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన యెడల,"

3 "మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి - నీవిక్కడ మంచి స్ధలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో - నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండు మని చెప్పిన యెడల."

4 మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసిన వారగుదురు కారా?

5 "నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?"

6 అయితే మీరు దరిద్రులను అవమాన పరచుదురు. ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా?

7 మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా?

8 మెట్టుకు నీవలె నీ పొరుగు వాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు.

9 మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.

10 "ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును;"

11 వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయములో నపరాధివైతివి.

12 స్వాతంత్య్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగుననే ప్రవర్తించుడి.

13 కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పు మించి అతిశయపడును.

14 "నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?"

15 "సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక యున్నప్పుడు,"

16 "మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక - సమాధానముగా వెళ్లుడి, చలికాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము?"

17 అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును.

18 "అయితే ఒకడు - నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును."

19 దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.

20 "వ్యర్థు, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నవా?"

21 మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?

22 "విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా?"

23 కాబట్టి - అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను.

24 "మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీని వలన గ్రహించితిరి."

25 అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపి వేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా?

26 ప్రాణములేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.

<< ← Prev Top Next → >>