Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / యాకోబు

Bible - Telugu Bible OV, 1880

హెబ్రీయులకు యాకోబు 1 పేతురు

అధ్యాయం 1 2 3 4 5

1 "నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదు మని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి."

2 "అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము, ఎవడైనను మాటయందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీన మందుంచుకొన శక్తిగల వాడగును."

3 "గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెము పెట్టి, వాటిశరీరమంతయు త్రిప్పుదుముగదా?"

4 "ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును."

5 ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును?

6 "నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును."

7 "మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని"

8 "ఏ నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే."

9 "దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము."

10 "ఒక్కనోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్లును; నా సహోదరులారా, ఈలాగుండ కూడదు."

11 నీటిబుగ్గలో ఒక్క జలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?

12 "నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లయినను, ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పునీళ్లలో నుండి తియ్యని నీళ్లును ఊరవు."

13 "మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచ వలెను."

14 "అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు."

15 ఈ జ్ఞానముపై నుండి దిగివచ్చునది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.

16 "ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును."

17 "అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది."

18 నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.

<< ← Prev Top Next → >>