Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / యాకోబు

Bible - Telugu Bible OV, 1880

హెబ్రీయులకు యాకోబు 1 పేతురు

అధ్యాయం 1 2 3 4 5

1 "ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి."

2 మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.

3 మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి.

4 "ఇదిగో మీ చేలు కోసిన పనివారి కియ్యక, మీరు మోసముగా బిగబట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి."

5 మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినము నందు మీ హృదయములను పోషించుకొంటిరి.

6 "మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు."

7 "సహోదరులారా, ప్రభువు రాక వరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా."

8 "ప్రభురాక సమిపించు చున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్ధిరపరచు కొనుడి."

9 "సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు."

10 "నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి."

11 సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు.

12 "నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడని గాని భూమితోడని గాని మరి దేనితోడని గాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటె అవును, కాదంటే కాదు అని ఉండవలెను."

13 మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థన చేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.

14 మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింప వలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను.

15 "విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును."

16 మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్ధత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థనచేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగలదై యుండును.

17 ఏలీయా మనవంటి స్వభావము గల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్ధన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీదం వర్షింపలేదు.

18 "అతడు మరల ప్రార్థన చేయగా అకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను."

19 "నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగి పోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల,"

20 పాపిని వాని తప్పు మార్గమునుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను.

<< ← Prev Top Next >>