Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 పేతురు

Bible - Telugu Bible OV, 1880

యాకోబు 1 పేతురు 2 పేతురు

అధ్యాయం 1 2 3 4 5

1 "యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి,"

2 "అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది- మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక."

3 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు

4 "అనగా- అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్ధ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను."

5 "కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీ కొరకు, ఆ స్వాస్ధ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది."

6 "ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది."

7 "నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడు చున్నది గదా? దాని కంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారమగును."

8 మీరాయనను చూడక పోయినను ఆయనను ప్రేమించుచున్నారు;

9 "ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు."

10 "మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు,"

11 "తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునప్పుడు, ఆ ఆత్మ, ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి."

12 "పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై, తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు."

13 "కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి."

14 నేను పరిశుద్ధుడు నై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15 "కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు ఆజ్ఞాన దశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,"

16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి.

17 పక్షపాతము లేకుండ క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

18 పితృ పారంపర్యమైన మీ వ్యర్ధ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదుగాని

19 "అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్ధోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తము చేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా?"

20 "ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్ష పరచబడెను."

21 కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి.

22 "మీరు క్షయబీజము నుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,"

23 "మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకని నొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా"

24 "సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును,"

25 అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే.

<< Prev Top Next → >>