Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 పేతురు

Bible - Telugu Bible OV, 1880

యాకోబు 1 పేతురు 2 పేతురు

అధ్యాయం 1 2 3 4 5

1 "ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి యున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును,"

2 "వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై,"

3 "నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి."

4 "మనుష్యుల చేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై,"

5 "యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు."

6 "ఏలయనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను; ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖన మందు వ్రాయబడియున్నది."

7 "విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైన వాడు; విశ్వసింపని వారికైతే- ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను."

8 "కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లు చున్నారు, దానికే వారు నియమింపబడిరి."

9 "అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు."

10 ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి- ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి;

11 "ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,"

12 "అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్ క్రియలను చూచి, వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను."

13 మనుష్యులు నియమించు ప్రతి కట్టకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.

14 "రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి యుండుడి."

15 "ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము."

16 "స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్య్రమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి."

17 "అందరిని సన్మానించుడి. సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. సేవ అనగా నేమి?"

18 "పనివారలారా, మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక, ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి."

19 "ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించిన యెడల అది హితమగును."

20 తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపునప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి.

21 "క్రీస్తు కూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి ఉంచిపోయెను."

22 ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

23 "ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను."

24 "మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీర మందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్ధత నొందితిరి."

25 . మీరు గొఱ్ఱెలవలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.

<< ← Prev Top Next → >>