Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 2 పేతురు

Bible - Telugu Bible OV, 1880

1 పేతురు 2 పేతురు 1 యోహాను

అధ్యాయం 1 2 3

1 "ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను."

2 "పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నారు."

3 "అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు,"

4 ఆయన రాకను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.

5 "ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలోనుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారి బుద్ధిపూర్వకముగా మరతురు."

6 ఆ నీళ్ల వలన అప్పుడు న్న లోకము నీటి వరదలోమునిగి నశించెను.

7 "అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై, అదే వాక్యము వలన భధ్రము చేయబడియున్నవి."

8 "ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా, ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి."

9 "కొందరు అలస్యమని ఎంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింప వలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు."

10 "అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమై పోవును, భూమియు దాని మీదనున్న కృత్యములును కాలిపోవును."

11 "ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక,"

12 "ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాక కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను."

13 అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము; వాటి యందు నీతి నివసించును.

14 "ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి."

15 మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానముచొప్పున మీకు వ్రాసియున్నాడు.

16 "వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు."

17 "ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి, మీకు కలిగిన స్ధిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి."

18 "మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక, ఆమేన్."

<< ← Prev Top Next >>