Bible, 1 యోహాను, అధ్యాయం 2. is available here: https://www.bible.promo/chapters.php?id=11161&pid=64&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 యోహాను

Bible - Telugu Bible OV, 1880

2 పేతురు 1 యోహాను 2 యోహాను

అధ్యాయం 1 2 3 4 5

1 "నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు."

2 "ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు."

3 "మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగి యున్నామని తెలిసికొందుము."

4 "ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యము లేదు."

5 ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;

6 ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయన యందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.

7 "ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు,ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే"

8 "మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీయందును సత్యమే."

9 "వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే యున్నాడు."

10 తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతని యందు అభ్యంతర కారణమేదియు లేదు.

11 "తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డి తనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు."

12 "చిన్న పిల్లలారా, ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను."

13 "తండ్రీలారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను."

14 "చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను మీ తండ్రీలారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీయందు నిలుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను."

15 "ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల, తండ్రి ప్రేమ వానిలో నుండదు."

16 "లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే."

17 "లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హెచ్చరికలు - క్రీస్తు విరోధులు"

18 "చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా- ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి ఘడియ అని దీనిచేత తెలిసి కొనుచున్నాము."

19 వారు మనలో నుండి బయలు వెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలు వెళ్లిరి.

20 అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.

21 "మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగి యున్నందున మీకు వ్రాయుచున్నాను."

22 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి.

23 కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు.

24 "అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన యెడల, మీరు కూడ కుమారుని యందును తండ్రియందును నిలుతురు."

25 నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.

26 మిమ్మును మోసపరచువారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసియున్నాను.

27 "అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింప నక్కర లేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు."

28 "కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి;"

29 ఆయన నీతిమంతుడని మీరెరిగియున్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు.

<< ← Prev Top Next → >>