Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 యోహాను

Bible - Telugu Bible OV, 1880

2 పేతురు 1 యోహాను 2 యోహాను

అధ్యాయం 1 2 3 4 5

1 "మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు."

2 "ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము."

3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.

4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమము పాపము.

5 "పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును, ఆయన యందు పాపమేమియు లేదు."

6 "ఆయన యందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు."

7 "చిన్న పిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు."

8 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.

9 దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.

10 "దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేట పడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు."

11 మన మొకని నొకడు ప్రేమింపవలెననునది మొదట నుండి మీరు వినిన వర్తమానమేగదా.

12 మనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్ఢవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?

13 "సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి."

14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేనివాడు మరణ మందు నిలిచియున్నాడు.

15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు.

16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై యున్నాము.

17 "ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతని యెడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును?"

18 "చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము."

19 ఇందువలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము.

20 "దేవుడు మన హృదయము కంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏయే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము."

21 "ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని యెదుట ధైర్యముగలవార మగుదము."

22 "మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును."

23 "ఆయన ఆజ్ఞ యేదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా, ఒకనినొకడు ప్రేమింప వలెననునదియే."

24 ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొనుచున్నాము.

<< ← Prev Top Next → >>