Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / ప్రకటన గ్రంథము

Bible - Telugu Bible OV, 1880

యూదా ప్రకటన గ్రంథము

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

1 ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశబ్దముగా ఉండెను.

2 అంతట నేను దేవుని యెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.

3 "మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను."

4 అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.

5 "ఆ దూత ధూపార్తిని తీసికొని, బలిపీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమి మీద పడవేయగా, ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను."

6 అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధ పడిరి.

ప్రకటన గ్రంథము 8:6 - The Seven Trumpets
The Seven Trumpets
7 "మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవభాగము కాలిపోయెను, చెట్లలో మూడవభాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను."

8 రెండవ దూత బూర ఊదినప్పుడు- అగ్ని చేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను.

9 "సముద్రములో ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశన మాయెను."

10 మూడవ దూత బూర ఊదినప్పుడు- దివిటి వలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము అకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను.

11 ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదై పోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.

12 "నాలుగవ దూత బూర ఊదినప్పుడు- సూర్య చంద్రనక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్రనక్షత్రములు ప్రకాశింప కుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను."

13 "మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో, అయ్యో, అయ్యో, అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని."

<< ← Prev Top Next → >>