1 అయిదవ దూత బూర ఊదినప్పుడు- ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను.
2 "అతడు అగాధము తెరవగా, పెద్ద కొలిమిలో నుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములో నుండ లేచెను; ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయు మండలమున చీకటి కమ్మెను."
3 "ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను."
4 మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమి పైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ జేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను.
5 "మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడ లేదు గాని అయిదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలే ఉండును."
6 ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును.
7 "ఆ మిడతల రూపములు యుద్దమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలియున్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి,"
8 స్త్రీ తలవెండ్రుకల వంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను.
9 ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.
10 తేళ్ల తోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.
11 "పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీ భాషలో వానికి అబద్ధోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వాని పేరు అపొల్లుయోను."
12 మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చును.
13 ఆరవ దూత బూర ఊదినప్పుడు- దేవుని యెదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి యొక స్వరము-
14 యూఫ్రటిసు అను మహానది యొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొనియున్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని.
15 "మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి."
16 గుఱ్ఱపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు; వారి లెక్క ఇంత అని నేను వింటిని.
17 "మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్న వారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమగంధకములు బయలువెలుచుండెను."
18 "ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెలుచున్న అగ్ని ధూమగంధకముల చేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను."
19 "ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగిన వైనందున వాటిచేత అవి హాని చేయును."
20 "ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహాములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు."
21 మరియు తాము చేయుచున్న నరహత్యలును మాయ మంత్రములను జార చోరత్వములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు. |