Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / ప్రకటన గ్రంథము

Bible - Telugu Bible OV, 1880

యూదా ప్రకటన గ్రంథము

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

1 "అప్పుడు పరలోక మందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా, సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను."

2 ఆమె గర్భిణియై ప్రసవ వేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.

3 అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలల మీద ఏడు కిరీటములుండెను.

4 "దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మ్రింగివేయ వలెనని ఆ ఘట సర్పము స్త్రీ యెదుట నిలుచుండెను."

5 "సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను."

6 ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరువది దినములు ఆమెను పోషింప వలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.

7 అంతట పరలోక మందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా-

8 ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోక మందు వారికిక స్థలము లేకపోయెను.

9 "కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాది యనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడెను."

ప్రకటన గ్రంథము 12:9 - Michael and Angels Fighting Dragon
Michael and Angels Fighting Dragon
10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని- రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

11 "వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు."

12 "అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి యున్నాడని చెప్పెను."

13 "ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడియుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను."

14 అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండ ఆమె ఒక కాలము కాలములు అర్థకాలము పోషింపబడును.

15 "కావున ఈ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెను గాని"

16 భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోటనుండి వెళ్ళగ్రక్కిన ప్రవాహమును మ్రింగివేసెను.

17 "అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించినవారితో యుద్ధము చేయుటకై బయలు వెలి సముద్రతీరమున నిలిచెను."

<< ← Prev Top Next → >>