Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible
Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / ప్రకటన గ్రంథము

Bible - Telugu Bible OV, 1880

యూదా ప్రకటన గ్రంథము

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

1 మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.

2 అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా - ఆ క్రూరమృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్ఢ పుండు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా- సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువు లన్నియు చచ్చెను.

3 మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను.

4 "అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడు, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;"

5 దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.

6 "అందుకు- అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని."

7 నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.

8 "కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, ఈ తెగుళ్లు మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు."

9 అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా- దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి;

10 తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోక మందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు.

11 ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా- తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు ఎండిపోయెను.

12 మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని.

13 "అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్లి,"

14 హెబ్రీ భాషలో హార్మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు.

15 ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా స మాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.

16 "అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను."

17 "మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపము కలుగ లేదు, అది అంత గొప్పది."

18 "ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి."

19 "ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను."

20 అయిదేసి మణుగుల బరువు గల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పెను;

21 ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి.

<< ← Prev Top Next → >>