Bible, ప్రకటన గ్రంథము, అధ్యాయం 21. is available here: https://www.bible.promo/chapters.php?id=11188&pid=68&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / ప్రకటన గ్రంథము

Bible - Telugu Bible OV, 1880

యూదా ప్రకటన గ్రంథము

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

1 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించి పోయెను. సముద్రమును ఇకను లేదు.

2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని.

3 "అప్పుడు - ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడ నున్నది, ఆయన వారితో నివాసముండును. వారాయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారి దేవుడై యుండి వారికి తోడైయుండును."

4 "ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్ష్పెనను, వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని."

5 అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు - ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు - ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.

6 "మరియు ఆయన నాతో ఇట్లనెను - సమాప్తమైనవి; నేనే ఆల్పాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను; దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును."

7 జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును. నేనతనికి దేవుడనై యుందును. అతడు నాకు కుమారుడై యుండును.

ప్రకటన గ్రంథము 21:7 - New Jerusalem, Alpha and Omega
New Jerusalem, Alpha and Omega
8 "పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులను, మాంత్రికులును, విగ్రహారాధకులును అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు; ఇది రెండవ మరణము."

9 "అంతట ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొని యున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి - ఇటు రమ్ము; పెండ్లి కుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి,"

10 "ఆత్మ వశుడనై యున్న నన్ను ఎత్తయిన గొప్ప పర్వతము మీదికి కొని పోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను."

11 దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది.

12 "ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములుఉండెను.; ఆ గుమ్మముల యొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి., ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి."

13 "తూర్పు వైపున మూడు గుమ్మములు, ఉత్తరపు వైపున మూడు గుమ్మములు, దక్షిణము వైపున మూడు గుమ్మములు, పశ్చిమవైపున మూడు గుమ్మములున్నవి."

14 "ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది, ఆ పునాదులపైన గొఱ్ఱెపిల్ల యొక్క పన్నిద్దరు అపొస్తలుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి."

15 "ఆ పట్టణమును, దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వానియొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను."

16 "ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత ఏడువందల యేబది కోసులైనది.; దాని పొడుగును ఎత్తును వెల్పును సమముగా నున్నది."

17 మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబది నాలుగు మూరలైనది. ఆ కొలత దూత కొలతయే.

18 ఆ పట్టణపు ప్రాకారము సూర్య కాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది.

19 "ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్య కాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ,"

20 "అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్య రాగము, పదియవది సువర్ణల సునీయము, పదకొండవది పద్మ రాగము, పన్నెండవది సుగంధము."

21 దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు; ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.

22 దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱె పిల్లయు దానికి దేవాలయమై యున్నారు.

23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దాని కక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది; గొఱ్ఱె పిల్లయే దానికి దీపము.

24 జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు.

25 అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.

26 జనములు తమ మహిమను ఘనతను దాని లోనికి తీసుకొని వచ్చెదరు.

27 "గొఱ్ఱె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపు."

<< ← Prev Top Next → >>